రాష్ర్టాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్‌-19పై సమీక్షించేందుకు నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరేతో పీఎం టెలిఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. గడిచిన 12 గంటల్లో దేశంలో 131 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య 1965కు చేరుకున్నట్లు వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది. వీటిలో 1764 యాక్టివ్‌ కేసులు కాగా 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 50 మరణాలు సంభవించినట్లుగా వెల్లడించింది.