బియ్యం పంపిణీ ప్రారంభం

కరోనా నేపథ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీమేరకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 2.80 కోట్లమంది పేదలకు బియ్యం అందించనున్నారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేషన్‌ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి 12 కిలోల బి య్యం అందజేసే కార్యక్రమం  మొదలైంది. 


కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్‌లో బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ బియ్యం పంపిణీని   ప్రారంభించారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పంపిణీ చేశారు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. వరంగల్‌ రూరల్‌   చౌకడిపోల్లో 418 కార్డులపై 14,964 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి దీప్తి వెల్లడించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట మండలం ఇల్లందలో  ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.