లింకురోడ్లు..

 ప్రాంతాల్లో రెండు ప్రధాన రోడ్లను కలుపుతూ ప్రతిపాదించిన లింకురోడ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. మూడు నెలల్లో వీటిని పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను అదుపు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు కాలనీల మీదుగా ప్రధాన రోడ్లను కలిపేందుకు 37 లింకు రోడ్లను ప్రతిపాదిస్తూ..సమగ్ర కార్యప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం కూడా ఇదివరకే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూసేకరణ జీహెచ్‌ఎంసీ చేపడుతుండగా,  నిర్మాణ బాధ్యతను హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. నాలుగు ప్యాకేజీలుగా పనులు చేస్తారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 37 లింకురోడ్లుగా అభివృద్ధి చేయనుండగా, వీటి మొత్తం పొడవు 44.70 కిలోమీటర్లు. రూ. 313.65కోట్లు వ్యయం అవుతుందని అంచనా. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న  ఈ రహదారుల నిర్మాణంలో ఖర్చులో 50శాతం, అంటే రూ. 157 కోట్లు జీహెచ్‌ఎంసీ భరించనుండగా, మిగిలిన 50 శాతం మొత్తాన్ని ప్రభుత్వం తమకు కేటాయించే బడ్జెట్‌ నిధులతో హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఖర్చు చేస్తున్నది.