ఆగ్రా చేరుకున్న ట్రంప్‌, మెలానియా

అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, కుటుంబ సభ్యులు తాజ్‌మహల్‌ సందర్శన  కోసం ఆగ్రా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.  ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా తాజ్‌మహల్‌ వద్దకు వెళ్లారు.  భార్య, కూతురు, అల్లుడితో కలిసి ట్రంప్‌ తాజ్‌ సందర్శనకు రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.