బియ్యం పంపిణీ ప్రారంభం
కరోనా నేపథ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీమేరకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 2.80 కోట్లమంది పేదలకు బియ్యం అందించనున్నారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి 12 కిలోల బి య్యం అందజేసే కార్యక్రమం మొదలైంది. …